: రాష్ట్రపతి రేసులో నేను లేను!: ఎల్కే అద్వానీ సంచలన వ్యాఖ్య
త్వరలోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగుస్తుండడంతో భారత తదుపరి రాష్ట్రపతి ఎవరు? అనే అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ దానికి సమాధానంగా ప్రధానంగా వినపడుతున్న పేరు బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ. అయితే, ఈ రోజు అద్వానీ మాట్లాడుతూ తాను రాష్ట్రపతి రేసులో లేనని స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, బీజేపీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.