: శివసేన ఎంపీ గైక్వాడ్‌పై ఎయిరిండియా నిషేధం ఎత్తివేత‌


ఎయిరిండియా ఉద్యోగిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించి చేయిచేసుకున్న శివ‌సేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఆ విమానయాన సంస్థ నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. అయితే, నిన్న గైక్వాడ్ క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఓ లేఖ రాయ‌డంతో ఈ రోజు పౌర విమానయాన శాఖ అధికారులు ఎయిరిండియాకు ఈ విష‌యమై లేఖ రాసి, గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాల‌ని కోరారు. దీంతో వెంట‌నే స్పందించిన ఎయిరిండియా అధికారులు ఆయ‌న‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇటీవలే ఎయిరిండియా ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన గైక్వాడ్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఆ ఉద్యోగిని 25 సార్లు చెప్పుతో కొట్టానని చెప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియాతో పాటు పలు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించడంతో గైక్వాడ్ విమానం ఎక్కలేని పరిస్థితి వచ్చింది. 

  • Loading...

More Telugu News