: పీఎఫ్ కనీస వేతన పరిమితి పెంపు?
ఇప్పటివరకు రూ.15 వేలుగా ఉన్న పీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) యోచిస్తోంది. ఈ ప్రతిపాదన త్వరలోనే ఆమోదం పొందనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఇపిఎఫ్ఓ బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ధరల పెరుగుదల, వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్‌వో ఈ ప్రతిపాదన చేస్తోంది. ఈ ప్రదిపాదన అమల్లోకి వస్తే లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. సంఘటిత రంగంలో ఉన్న 60 లక్షలకు పైగా ఉద్యోగులను తమ సోషల్ సెక్యూరిటీ పరిధిలోకి ఈ సంస్థ చేర్చుకోనుంది. ఈ సెక్టార్‌లో 4 కోట్లమంది ఉద్యోగులు ఈపీఎఫ్‌వో ఖాతాదారులుగా ఉన్నారు. అయితే, ఈ కనీస వేతన పరిమితిని రూ.21 వేలకి పెంచాలని సర్కారు భావిస్తోంది.