: మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లడం నిరాశకు గురి చేసింది : స్మిత్


ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు కొనసాగడం తనను నిరాశకు గురిచేసిందని పూణే సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. తొలి మ్యాచ్ లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన స్మిత్...తమ అంచనాలను ముంబై జట్టు తల్లకిందులు చేసిందని అన్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావించామని అన్నాడు. స్పిన్నర్ ను లక్ష్యంగా చేసుకుని ముంబై ఇండియన్స్ దూకుడు ప్రదర్శిస్తారని భావించామని, అయితే వారు అశోక్ దిండాను లక్ష్యం చేసుకున్నారని చెప్పాడు. అంతే కాకుండా 160 పరుగులలోపు వారిని కట్టడి చేయాలని భావించామని, అయితే చివరి ఓవర్ లో హార్డిక్ పాండ్య దూకుడుతో స్కోరు 184 పరుగులకు వెళ్లడం నమ్మశక్యం కాలేదని పేర్కొన్నాడు. టీ20ల్లో ఫామ్ అనుకుని కూర్చుంటే అద్భుతాలు చేయలేమని, బ్యాటింగ్ కు దిగిన దగ్గర్నుంచి బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆటగాళ్లకు సూచించానని స్మిత్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News