: జియో సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్ రద్దు ఎఫెక్ట్‌: లాభాల్లో ఎయిర్‌టెల్‌, ఐడియా షేర్లు


ఇటీవల రిలయన్స్ జియో ప్రకటించిన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశించ‌డంతో జియో దానికి ఓకే చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఇత‌ర టెలికాం సంస్థల షేర్లు ఈ రోజు దూసుకుపోతున్నాయి. ప్ర‌ధానంగా భారతి ఎయిర్‌ టెల్‌, ఐడియా తదితర‌ కంపెనీలు పైకి ఎగబాకుతున్నాయి. నేటి మార్కెట్లో మదుపర్లు టెలికాం ఇండెక్స్‌ లో కొనుగోళ్లవైపు ఆస‌క్తి చూపారు. ఈ రోజు భారతి ఎయిర్‌ టెల్  సుమారు 3 శాతంపైగా ఎగిసి టాప్‌ గెయినర్‌గా నిలవ‌గా, ఐడియా సెల్యులర్‌ 2 శాతానికిపైగా జంప్ చేసింది. అదే స‌మ‌యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1 శాతానికి పైగా నష్టపోయింది.

  • Loading...

More Telugu News