: జనావాసంలోకి వచ్చిన అరుదైన స్వర్ణనాగు.. భయంతో కొట్టి, చంపేశారు
అతి తక్కువగా కనిపించే స్వర్ణనాగును కొట్టి చంపేసిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్ కూడలి వద్దకు నిన్న ఓ భారీ స్వర్ణనాగు వచ్చింది. దాన్ని చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్టీఆర్ కూడలి నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. నాగును చూసిన జనాలు భయంలో కేకలు వేయడంలో... అది పక్కనే ఉన్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి దూరింది. మూడు గంటల పాటు అక్కడ కలకలం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో, చివరకు ఓ ఆటో డ్రైవర్ ఆ పామును ఓ కర్రతో కొట్టి చంపేశాడు. దీంతో, జనాలు ఊపిరి పీల్చుకున్నారు.