: అమితాబ్‌ ట్వీట్‌ తో ఆందోళన చెందిన వినోద్‌ ఖన్నా ఫ్యాన్స్


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవ‌లే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆసుపత్రిలో ఆయ‌న‌ చికిత్స పొందుతున్న వేళ అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన ఓ ట్వీటు వైర‌ల్‌గా మారింది. నటుడు వినోద్‌ ఖన్నా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటుండ‌గా తీసిన ఫొటో ఒకటి బయటికి వ‌చ్చిన నేప‌థ్యంలో అమితాబ్‌ బచ్చన్‌ ట్విటర్‌లో ఓ మెసేజ్ పెడుతూ.. మన కుటుంబీకులు, స్నేహితులు మృతి చెందిన‌ప్పుడు మనమెంత కాలం బతుకుతామో అని ఆలోచిస్తుంటామ‌ని పేర్కొన్నారు. ఈ విష‌యం ఎంతో విచిత్రంగా ఉంది కదా? అని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా తాను దిగాలుగా ఉన్న ఫొటో ఒకటి పోస్ట్‌ చేశారు. త‌న స్నేహితుడు వినోద్‌ ఖన్నాను ఉద్దేశిస్తూ చేసిన ఈ పోస్టు ప‌ట్ల ఆందోళ‌న చెందిన ప‌లువురు వినోద్‌ ఖన్నా క‌న్నుమూశార‌నుకొని ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారట. దీంతో వినోద్ క‌న్నా కుమారుడు మీడియా ముందుకు వ‌చ్చి తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పాల్సి వ‌చ్చింది.



  • Loading...

More Telugu News