: పరారీలో ఉన్న అగ్రిగోల్డ్ నిందితుల ఇళ్లకు సీఐడీ నోటీసులు


అగ్రిగోల్డ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలు రాష్ట్రాల్లోని జనాలు ఈ సంస్థ చేతిలో నిట్టనిలువునా మునిగిపోయారు. కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులంతా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో చివరకు హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీఐడీ అధికారులకు చిక్కకుండా పరారీలో ఉన్న అగ్రిగోల్డ్ నిందితుల ఇళ్లకు అధికారులు నోటీసులు అంటించారు. వీరిని పట్టుకోవడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు ముమ్మరం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిందితులైన అవ్వా హేమసుందర ప్రసాద్, అవ్వా సాయిరాం, అవ్వా ఉదయభాస్కర్ ల ఇళ్లకు నోటీసులు అంటించారు. 

  • Loading...

More Telugu News