: శశికళకు ఝలక్... తమిళనాడు మంత్రిపై ఐటీ దాడులు


ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల గుర్తును కోల్పోయి ఇబ్బందులు పడుతూ, ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తంటాలు పడుతున్న శశికళ వర్గానికి మరో ఝలక్ తగిలింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, క్వారీలు సహా మొత్తం 30కి పైగా ప్రాంతాలలో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. ఆర్కే నగర్ లో ఓటర్లకు భారీగా డబ్బులను విజయ భాస్కర్ పంపిణీ చేస్తున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ శాఖ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News