: క్షమాపణలు చెబితే.. ఎంపీ గైక్వాడ్ పై నిషేధం ఎత్తివేస్తాం: ‘ఎయిర్ ఇండియా’ వర్గాలు


విమానయాన సంస్థ అధికారిపై అవమానకర రీతిలో ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ రాత పూర్వకంగా క్షమాపణలు చెబితే ఆయనపై విధించిన నిషేధాన్నిఎత్తి వేస్తామని ‘ఎయిర్ ఇండియా’ వర్గాలు వెల్లడించాయి. దురుసుగా ప్రవర్తించిన గైక్వాడ్ పేరును ప్రయాణికుల నిషేధిత జాబితాలో విమానయాన సంస్థలు చేర్చిన విషయం తెలిసిందే. ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. గైక్వాడ్ రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పేందుకు అంగీకరిస్తే, ఆయనపై నిషేధాన్ని ఎత్తివేస్తామని, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సదరు సంస్థ చెప్పినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. కాగా, ఎయిర్ ఇండియా అధికారిపై చేయి చేసుకున్న సంఘటనపై గైక్వాడ్ పశ్చాత్తాపం చెందుతూ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు ఈ రోజు ఓ లేఖ రాశారు. తనపై విధించిన నిషేధం ఎత్తివేయాలని ఆ లేఖలో గైక్వాడ్ కోరారు. 

  • Loading...

More Telugu News