: మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన వొడాఫోన్
తమ వినియోగదారుల ముందు ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తూ పలు టెలికాం కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఒక కంపెనీని మించి మరో కంపెనీ పోటాపోటీగా ఆఫర్లు కురిపిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ తమ 4జీ యూజర్ల ముందుకు ఓ అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది. తమ 4జీ యూజర్లందరికీ ఇంటర్నేషనల్ రోమింగ్ ఫ్రీ అని, విదేశాలకు వెళ్లిన వొడాఫోన్ యూజర్లు ఎంతైనా హైస్పీడ్ 4జీ నెట్‌వర్క్‌ను వాడుకొనే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపింది. ఈ ఆఫర్ ప్రస్తుతానికి 40 దేశాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.