: అవార్డు కోసం నేను వెంటపడ్డానా?... గడ్కరీ వ్యాఖ్యలు బాధించాయి: నటి ఆశా పరేఖ్


ప్రభుత్వం ఇచ్చే పురస్కారం పద్మభూషణ్ కోసం తాను వెంటపడ్డానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమధ్య చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని నటి ఆశా పరేఖ్ చెప్పారు. ఈ అవార్డుకు తన పేరును సిఫార్సు చేయాలని ఆశా, తన వద్దకు వచ్చినట్టు గతంలో గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇదే విషయమై స్పందిస్తూ, సినీ పరిశ్రమలో వివాదాలు కూడా భాగమేనని, అది తనకు పెద్ద విషయమేమీ కాదని అన్నారు. తానేమీ ఆయన వెంటపడలేదని స్పష్టం చేశారు. ఆయన ఆ తరహాలో వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని చెప్పారు. కాగా, దాదాపు పాతికేళ్ల క్రితమే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆశా పరేఖ్, 2014లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా అందుకున్నారు.

  • Loading...

More Telugu News