: రూ. 500 కోట్లు కొట్టేసిన 'కాల్ సెంటర్ స్కామ్' షాగీ... దుబాయ్ లో దొరికిపోయాడు


పుణె కేంద్రంగా కాల్ సెంటర్ ను నిర్వహిస్తూ, పలువురు అమెరికన్లను టార్గెట్ చేసి రూ. 500 కోట్లకు పైగా నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీని దుబాయ్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్టు పుణె పోలీసులకు సమాచారం అందింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు ఉండటంతో, దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణానికి సిద్ధమైన వేళ, గుర్తించినట్టు తెలుస్తోంది. అక్కడి అధికారులు ప్రస్తుతం షాగీని ప్రాథమికంగా విచారిస్తున్నారని, ఆపై తనకు అప్పగించాలని కోరనున్నామని థానే పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. మరిన్ని వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

కాగా, ఈ కేసులో 5 వేలకు పైగా పేజీలున్న చార్జ్ షీట్ ను ఫైల్ చేసిన పోలీసులు, మొత్తం 700 మందిని నిందితులుగా తేల్చారు. వీరిలో అత్యధికులు కాల్ సెంటర్ లో పనిచేసిన ఉద్యోగులే కావడం గమనార్హం. గత సంవత్సరం తన స్నేహితురాలికి కోట్ల రూపాయల ఖరీదైన ఆడి కారును షాగీ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పన్ను ఎగ్గొడుతున్న వారి సమాచారాన్ని సేకరించి, తాము ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) నుంచి కాల్ చేస్తున్నామని చెబుతూ, బెదిరించి, వారి నుంచి కోట్ల రూపాయలను షాగీ టీమ్ దండుకోగా, ఈ కేసు సంచలనం సృష్టించింది.

  • Loading...

More Telugu News