: కశ్మీర్ విషయంలో కలగజేసుకోవాల్సి వస్తుంది: ఇండియాకు చైనా వార్నింగ్


అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామాను పర్యటించకుండా చూడాలంటూ కోరినా భారత్ పట్టించుకోకపోవడంపై చైనా కారాలు, మిరియాలు నూరుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ అండతో కశ్మీర్ లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో తాము కూడా తలదూరుస్తామంటూ చైనా కారుకూతలు కూస్తోంది. దలైలామా పర్యటనను వెంటనే ఆపకపోతే... కశ్మీర్ అంశంలో తాము కలగజేసుకోవాల్సి వస్తుందని చైనా హెచ్చరించింది. ఈ మేరకు తన అధికార మీడియాలో కథనాన్ని ప్రచురించింది. అరుణాచల్ ప్రదేశ్ లో దలైలామా పర్యటించేలా భారత్ తీసుకున్న నిర్ణయం ఓ మతిలేని, అనాగరిక చర్య అంటూ విమర్శించింది. మరోవైపు దలైలామా పర్యటన రాజకీయాలకు అతీతమైనదని, మతపరమైనదని భారత్ ఇంతకుముందే స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News