: ఆర్థిక పరిస్థితి బాగుంటే నిర్ణయం తీసుకోవచ్చు!: రుణమాఫీపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు


రుణమాఫీపై కేంద్రమంతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే రుణమాఫీ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై ఇచ్చిన హామీని తొలి కేబినెట్‌ భేటీలోనే అమలు చేయడం గొప్ప చర్య అని పేర్కొన్న వెంకయ్య, ఇది జాతీయస్థాయి కార్యక్రమం కాదని, రాష్ట్రాలకు సంబంధించినదని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి వారు కూడా రుణమాఫీపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్.. ఇలా ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పరిస్థితి అని, ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ఆ రాష్ట్రంలో రుణమాఫీ చేసి ఆ తర్వాత పక్క రాష్ట్రాల గురించి మాట్లాడితే బాగుంటుందని వెంకయ్యనాయుడు సూచించారు.

  • Loading...

More Telugu News