: కాంగ్రెస్‌కు రాజీనామా చేశాకే బీజేపీలో చేరా.. అప్పట్లో ఎన్టీఆర్ కూడా అలాగే చేయించారు!: విమర్శలను తిప్పికొట్టిన పురంధేశ్వరి


పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాసి సంచలనం సృష్టించిన బీజేపీ నేత పురంధేశ్వరి తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలో చేరిన విషయాన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఒంగోలులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అమిత్‌షాకు లేఖ రాసిన విషయం వాస్తవమేనన్నారు.

అప్పట్లో ఆదెయ్య, రత్తయ్యలను కూడా పదవులకు రాజీనామా చేశాకే ఎన్టీఆర్ పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాసిన లేఖలోని అంశాలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పురంధేశ్వరి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News