: బీఫ్ తినొద్దన్న ముస్లిం మతపెద్ద పదవి ఊడింది!
హిందువుల మత విశ్వాసాలను గౌరవిస్తూ బీఫ్ ను ముస్లింలు కూడా నిషేధించాలని, ఇకపై తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ బీఫ్ తినమని చెప్పిన అజ్మీర్ దర్గా మతాధిపతి జైనుల్ అబేదిన్ ఖాన్ తన పదవి పోగొట్టుకున్నారు. ఆయన పదవి పోయిందని, దానిని తాను చేపట్టనున్నానని ఆయన సోదరుడు అలావుద్దీన్ అలిమి ప్రకటించారు. ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తి 805 వ వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. అలాగే ముస్లింలు ట్రిపుల్ తలాక్ కు దూరంగా ఉండాలని సూచించారు. ట్రిపుల్ తలాక్ ను ఆచరిస్తే ఖురాన్ ను వ్యతిరేకించినట్టేనని ఆయన తెలిపారు ఈ వ్యాఖ్యలు పెను కలకలం రేపాయి. దాంతో తాజాగా ఆయనను పదవి నుంచి తొలగించారు.