: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురి మృతి


పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. భారత్ సరిహద్దులకు 15 కిలో మీటర్ల దూరంలో లాహోర్ పరిసరాల్లో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అందులో నలుగురు పాకిస్థాన్ సైనికులుండడం విశేషం. అంతే కాకుండా ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఒక్కసారిగా సూసైడ్ బాంబర్ విరుచుకుపడడంతో భారీ శబ్దంతో బాంబుపేలుడు సంభవించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ బాంబు పేలుడుకు పాల్పడింది ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News