: మిగ్ -29 యుద్ధ విమానానికి తొలి మహిళా పైలట్ గా కాశ్మీర్ ముస్లిం యువతి!
ఇండియాలో మిగ్ -29 ఫైటర్ జెట్ కు తొలి మహిళా పైలట్ గా కాశ్మీరుకు చెందిన 21 సంవత్సరాల ఆయేషా అజీజ్ చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే మిగ్ విమానాలను నడిపేందుకు అవసరమైన కమర్షియల్ లైసెన్స్ ను పొందిన ఆయేషా, ధ్వని వేగంకన్నా అధిక వేగంతో దూసుకువెళ్లే మిగ్-29ను నడిపి తన కలను నెరవేర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు మిగ్ విమానాలు తయారు చేసే రష్యన్ ఏజన్సీతో చర్చిస్తున్నామని, తన తదుపరి ప్రయాణం మిగ్-29 యుద్ధ విమానంలోనేనని ఆయేషా చెబుతున్నారు.
కాగా, 2012లో 16 ఏళ్ల వయసులోనే బాంబే ఫ్లయిట్ క్లబ్ నుంచి స్టూడెంట్ పైలట్ లైసెన్స్ పొందిన ఆయేషా, నాసాలో రెండు నెలల అడ్వాన్స్డ్ స్పేస్ ట్రైనింగ్ ను కూడా పూర్తి చేశారు. భారత మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ తనకు ఆదర్శమని చెప్పుకున్న ఆయేషా, కాశ్మీర్ యువతులు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ముందడుగు వేస్తున్నారని అన్నారు.