: ఈ సినిమాలో ఫస్ట్ హీరో... హీరోయిన్ రితికాసింగే!: ఆకాశానికెత్తిన లారెన్స్


'శివ లింగ' సినిమా ప్రమోషన్ లో కోలీవుడ్ నటుడు లారెన్స్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. సాధారణంగా సినిమాల ప్రమోషన్ సందర్భంగా తమ సినిమా గురించి, ఆ సినిమాలో నటించిన నటులు, దర్శకుల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారన్నది తెలిసిందే. అయితే ఈనెల 14న తమిళనాడులో విడుదల కానున్న 'శివ లింగ' సినిమా ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ, ఈ సినిమాలో మొదటి హీరో...హీరోయిన్ గా నటించిన రితికా సింగేనని అన్నాడు.

 దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. రితికా సింగ్ అద్భుతంగా నటించిందని అన్నాడు. పవర్ ఫుల్ రోల్ లో అద్భుతంగా నటించిందని, ఆమె నటించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నాడు. డైరెక్టర్ పి.వాసు పెద్ద డైరెక్టర్ అని భయపడ్డానని, అయితే తొలి రోజు షూటింగ్ లోనే తాము మంచి స్నేహితులుగా మారిపోయామని లారెన్స్ చెప్పాడు. ఈ సినిమా విజయం సాధిస్తుందని లారెన్స్ చెప్పాడు. లారెన్స్ తనకంటే హీరోయిన్ ను పొగడడంపై కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

  • Loading...

More Telugu News