: ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4... ఎలా పొందవచ్చంటే!
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమి మరో ఆకర్షణీయ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4ను కొనుగోలు చేసే అవకాశాన్ని రేపు నిర్వహించనున్న 'ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్'లో దగ్గర చేయనున్నట్టు పేర్కొంది. స్మార్ట్ ఫోన్లలో తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆపై రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లందరూ ఈ ఆఫర్ లో పాల్గొనవచ్చని తెలిపింది. ఎంఐ డాట్ కామ్ వెబ్ సైట్ లో జరిగే సేల్స్ లో భాగంగా ఉదయం 10 గంటలకు రెడ్ మి నోట్ 4 స్మార్ట్ ఫోన్లను, మధ్యాహ్నం 2 గంటలకు ఎంఐ బ్యాండ్ 2లు, 10000 ఎంఎహెచ్ పవర్ బ్యాంకులను అందుబాటులో ఉంచుతామని సంస్థ తెలిపింది. తమ ఫ్లాష్ సేల్ లో భాగంగా తొలుత రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు ఎవరైనా వీటిని పొందవచ్చని వెల్లడించింది. అయితే, రెడ్ మి స్మార్ట్ ఫోన్లు 20, ఎంఐ బ్యాండ్ 2లు 40, 10000 ఎంఎహెచ్ పవర్ బ్యాంకులు 50 మేరకు మాత్రమే ఒక్క రూపాయి డీల్స్ కింద విక్రయించనున్నామని షియోమి తెలిపింది. ఇక ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా పలు రకాల ప్రొడక్టులపై రూ. 500 వరకూ తగ్గింపును ఇస్తున్నామని, స్టాక్స్ ముగిసేవరకూ విక్రయాలు సాగిస్తామని వివరించింది.