: పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన కీర్తి సురేష్


'కాటమరాయుడు' సినిమా తరువాత పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. మొన్న ఈ షూటింగ్ లో అను ఇమ్మాన్యుయేల్ పాల్గొని ట్విట్టర్ లో ఆ విషయం తెలుపగా... నిన్న కీర్తి సురేష్ కూడా షూటింగ్ లో పాల్గొంది.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన కీర్తి సురేష్... తొలి రోజు షూటింగ్ అద్భుతంగా జరిగిందని, పవన్ కల్యాణ్ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని, అభిమానులు, ప్రేక్షకుల దీవెనలు కావాలని కోరింది. తెలుగులో ఇప్పటికే మంచి పేరు, రెండు హిట్లు ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్ కు తెలుగులో తొలి భారీ సినిమా నేరుగా పవన్ కల్యాణ్ తో చేసే అవకాశం దక్కడంతో స్టార్ హోదా వచ్చేసినట్టేనని సినీ అభిమానులు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News