: 'డివిలియర్స్‌.. బాధపడకు' అంటూ సెటైర్ వేసిన గుజరాత్ ఆటగాడు....మాటల తూటా!


ఐపీఎల్ ప్రారంభానికి ముందు మాటల తూటా పేలింది. ఐపీఎల్ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిలియర్స్‌ పై గుజరాత్‌ లయన్స్‌ ఆటగాడు బ్రెండన్ మెక్‌ కల్లమ్‌ సెటైర్ వేశాడు. వెన్నెముక నొప్పితో బాధపడుతున్న డివిలియర్స్‌ తన గైర్హాజరీలో ఆడనున్న ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ, ప్రారంభ వేడుకలతో పాటు తొలి మ్యాచ్‌ కు దూరం కావడం పట్ల ఎంతో నిరుత్సాహానికి గురవుతున్నానని ట్వీట్ చేశాడు. వాట్సన్ కు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి గుజరాత్‌ లయన్స్‌ జట్టుకు ఆడుతున్న బ్రెండన్ మెక్‌ కల్లమ్‌ స్పందించాడు. తొలి మ్యాచ్‌ ఆడలేకపోతున్నందుకు బాధపడకు... వీలైతే ఆర్సీబీ జట్టు కోచ్‌ బాధ్యతలు స్వీకరించి, ఆ స్థానంలో ఉన్న డానియల్‌ వెటోరీని క్రీజులోకి పంపు అని ఎద్దేవా చేశాడు. కాగా, డివిలియర్స్ సఫారీ జట్టు విధ్వంసకర ఆటగాడైతే...మెక్ కల్లమ్ కివీస్ విధ్వంసకర ఆటగాడన్న సంగతి తెలిసింది. 

  • Loading...

More Telugu News