: తమిళ నటి నందిని భర్త ఆత్మహత్య


తమిళ నటి నందిని భర్త కార్తికేయన్ (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నైలో జిమ్ నిర్వహిస్తున్న కార్తికేయన్ గతంలో మొదటి వివాహం చేసుకున్నాడు. భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల క్రితం నటి నందినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొన్నాళ్లుగా వాళ్లిద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జిమ్ కూడా మూతపడింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన కార్తికేయన్ విషం తీసుకుని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News