: భారతదేశం ముమ్మాటికీ హిందూ రాజ్యమే!: వీహెచ్ పీ అధినేత ప్రవీణ్ తొగాడియా
భారతదేశం ముమ్మాటికీ హిందూ రాజ్యమే అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఈ దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని ఆయన హెచ్చరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తే, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలే అక్కడ కూడా పునరావృతమవుతాయని చెప్పారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.