: ఇది నిజమా?...నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు: సినీ హీరో కార్తీ


మణిరత్నం సినిమాలో నటించానన్న వాస్తవం ఇంకా నమ్మశక్యంగా లేదని ప్రముఖ సినీ నటుడు కార్తీ తెలిపాడు. హైదరాబాదులో 'చెలియా' సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన సందర్భంగా కార్తీ, అదితి రావ్ హైదరి మాట్లాడుతూ, తాము మణిరత్నం సినిమాలు చూస్తూ పెరిగామని అన్నారు. మణిరత్నం సినిమాలో నటిస్తామని కలలో కూడా ఊహించలేదని వారు చెప్పారు. ఊహించని విధంగా తమకు అవకాశం వచ్చిందని, ఇది కల నిజమవ్వడమేనని వారు తెలిపారు. సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదని, మణిరత్నం గత సినిమాలు ఎలా ప్రేక్షకులను అలరించాయో ఈ సినిమా కూడా అలాగే అలరిస్తుందని వారు చెప్పారు. కశ్మీర్ లో కష్టమైన లొకేషన్లలో అద్భుతమైన ఫోటోగ్రఫీతో చిత్రీకరించారని, సినిమా అలరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News