: ఇంత జరిగినా.. పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు?: వైసీపీ నేత దుర్గేశ్


ప్రశ్నించడానికే జనసేన పార్టీ అని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్... రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నేత కందుల దుర్గేష్ ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, పార్టీ మారిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టిందని... ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.  పార్టీ మారిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం అత్యంత దారుణం అని అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో నలుగురికి కేబినెట్ లో చంద్రబాబు చోటు కల్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News