: చంద్రబాబూ... ఇదేనా మీ నీతి, నిజాయితీ: ఎంపీ మిథున్ రెడ్డి


తాను నీతిమంతుడినని, నిజాయతీ పరుడినని చెప్పుకునే చంద్రబాబు, ఓ పార్టీ నుంచి గెలిచిన వారిని ఆకర్షించి, వారితో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవులు ఎలా కట్టబెడతారని, ఇదేనా నీతి, నిజాయతీ? అంటూ వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మధ్యాహ్నం పీలేరులో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు, రాజధాని నిర్మాణం పేరిట కోట్ల రూపాయల నిధులు తెచ్చుకుంటూ, ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని నిప్పులు చెరిగారు. పదేపదే అవినీతికి పాల్పడుతూ, అక్రమాలు, దోపిడీలకు తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర బిందువైందని ఆరోపించారు. కేవలం లోకేష్ కోసమే విస్తరణ చేపట్టిన చంద్రబాబు, 16 శాతం మంది ఉన్న ముస్లింలను మంత్రివర్గంలో చేర్చుకోలేదని, ఆయన నిజస్వరూపం ఇప్పుడు ప్రజలకు తెలుస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News