: చైనా వార్నింగ్... దీటుగా స్పందించిన ఇండియా!


బౌద్ధ గురువు దలైలామాను, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు అనుమతించరాదని చైనా హెచ్చరించిన వేళ, భారత్ దీటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమని, దీన్ని ఎవరూ వేరు చేయలేరని చెబుతూ, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. దలైలామా పర్యటనపై చైనా అభ్యంతరాలు సరికాదని, ఇది మతపరమైన పర్యటన తప్ప, రాజకీయాలు లేవని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కాగా, నేటి నుంచి దలైలామా వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తూ, చైనా సరిహద్దుల్లో అత్యంత సున్నితమైన తవాంగ్ లో సైతం పర్యటించనున్న సంగతి తెలిసిందే. దలైలామాను అడ్డుకోకుంటే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, దౌత్యపరమైన ఇబ్బందులు తప్పవని చైనా హెచ్చరించింది.

  • Loading...

More Telugu News