: చీరకట్టులో మెరిసిన ఆస్ట్రేలియా ఎంపీ... కవితకు థ్యాంక్స్


ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యురాలు జోడీ మెక్ కే చీర కట్టులో మెరిసిపోయారు. సిడ్నీలో తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, చీర కట్టుకుని వచ్చి సందడి చేశారు. ఇటీవల ఆమె హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఈ చీరను బహూకరించారు. ఆ చీరనే మెక్ కే కట్టుకున్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేస్తూ, తనకు చీరను గిఫ్ట్ గా ఇచ్చిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News