: అమీ జాక్సన్ ఆట - రెహమాన్ పాట... అదిరిపోనున్న ఐపీఎల్ ఆరంభం


రేపు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ పదవ సీజన్ ఆరంభ వేడుకలు అదిరిపోయే రీతిలో సాగనున్నాయి. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 6:20కి ప్రారంభ వేడుక మొదలవుతుంది. తొలుత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ లు గోల్ఫ్‌ కార్ట్‌ లలో మైదానంలోకి ప్రవేశిస్తారు. ఆపై వీరి ఘనతలు, సాధించిన రికార్డులను గురించి ప్రస్తావిస్తూ, ఆడియో, వీడియో ప్రదర్శన ఉంటుంది.

ఆపై రవిశాస్త్రి వ్యాఖ్యాతగా, వీరంతా ప్రసంగిస్తారు. క్రికెటర్లకు సన్మానం తరువాత బాలీవుడ్‌ నటి అమీ జాక్సన్‌ 300 మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన ఇవ్వనుంది. ఆపై ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రదర్శన ఉంటుంది. కాగా, రెహమాన్ పెర్ఫార్మెన్స్ అధికారికంగా ప్రకటితమైనా, ఆయన వచ్చే విషయమై కొంత సందిగ్ధత నెలకొనివుంది. ఇక ఈ ఆరంభ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు.

  • Loading...

More Telugu News