: అత్యాచార కేసులో కర్ణాటక డ్యాన్స్ మాస్టర్ అరెస్ట్


నృత్యం నేర్చుకోవడానికి తన వద్దకు వచ్చిన ఓ యువతి (23)ని వివాహం చేసుకుంటానని నమ్మించి, ఆపై అత్యాచారానికి ఒడిగట్టిన డ్యాన్స్ మాస్టర్ ను కర్ణాటక పరిధిలోని బాణసవాడి పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, క్రిస్టోఫర్ డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తుంటాడు. 2014లో అతని వద్దకు డ్యాన్స్ నేర్చుకునేందుకు బాధితురాలు వచ్చి చేరింది. ఆపై ఆమెను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని చెప్పి, గత సంవత్సరం అక్టోబరులో లోబరచుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే, తప్పించుకుతిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు క్రిస్టోఫర్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News