: నా రాజకీయ రిటైర్మెంట్ ను చంద్రబాబే ప్రకటించారు...సీనియర్లను గౌరవించకపోవడం బాధాకరం: కంటతడి పెట్టిన గౌతు శివాజీ
తన రాజకీయ రిటైర్మెంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రకటించారని శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత సీనియర్లను గౌరవించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. పార్టీ అధినేత కనీసం తనతో మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవి ఆశించలేదని, ఆకాంక్షించానని అన్నారు. అయితే సీఎం కనీసం తనను సంప్రదించలేదని ఆయన కంటతడి పెట్టుకున్నారు.