: ఇరాక్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు విముక్తి


ఇరాక్ లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. ఇరాక్ లోని ఎర్బిల్ నగరంలో 10 నెలల క్రితం 32 మంది చిక్కుకున్నారు. ఇందులో 31 మంది తెలంగాణ వాసులు కాగా, ఒక్కరు పంజాబీ. వారందర్నీ తెలంగాణ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తో చర్చించి విడిపించారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్న వీరిలో 18 మందిని తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ నుంచి హైదరాబాదుకు పంపించారు. మిగిలిన వారిని ఇతర రైళ్లలో స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఇరాక్ లో నరకం చూసి, స్వస్థలానికి చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు ధన్యవాదాలు తెలిపారు. 

  • Loading...

More Telugu News