: తమ పార్టీ నుంచి గెలిచిన సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడంపై నిరసన.. కాసేపట్లో గవర్నర్ను కలవనున్న జగన్
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన పలువురు నేతలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఆ నేతలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని ఇప్పటికే డిమాండ్ చేసిన వైసీపీ నేతలు మరికాసేపట్లో రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు గవర్నర్ వద్దకు బయలుదేరారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం చట్ట విరుద్ధమని వారు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడతారు.