: పీవీ సింధును ప్రశంసించిన సీఎంలు, క్రికెటర్లు, హీరోయిన్లు
భారత బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ పీవీ సింధు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆమెకు అభినందనలు తెలిపి ఆమె మరిన్ని విజయాలు నమోదు చేయాలని అన్నారు. అలాగే తెలంగాణ మంత్రి హరీశ్ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఆమెకు అభినందనలు తెలిపారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ సింధు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హీరోయిన్లు అనుష్క శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్ కూడా సింధు సాధించిన విజయాన్ని అభినందించారు.