: రాష్ట్రంలోనూ ఎంతో ఆద‌ర‌ణ పెరుగ‌ుతోంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయమే మా లక్ష్యం: బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు


రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీకి ఎంతో ఆద‌ర‌ణ పెరుగ‌తోందని, 2019 ఎన్నిక‌ల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు లక్ష్మ‌ణ్ అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన కార్య‌క్ర‌మాలతో పేద వ‌ర్గాలు ల‌బ్ధి పొందుతున్నాయని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రెండు రాష్ట్రాల్లో త‌మ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌ని, మ‌రో రెండు రాష్ట్రాల్లోనూ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి స‌త్తా చాటింద‌ని అన్నారు. ద‌క్షిణాదిలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా త‌మ‌ పార్టీయే మెజార్టీ సాధిస్తుందని అన్నారు. తెలంగాణ‌లో కూడా బీజేపీ, న‌రేంద్ర మోదీ పాల‌న ప‌ట్ల ఆద‌ర‌ణ పెరుగుతోందని చెప్పారు. త‌మ పార్టీని మ‌రింత‌ ప్ర‌తిష్టం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామ‌ని చెప్పారు. తమకు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోందని అన్నారు. దక్షిణాదిలోనూ బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వస్తుందని తాము నమ్ముతున్నామని అన్నారు. మోదీ పాలన పట్ల పెరుగుతున్న ఆదరణతో తమ పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. 

  • Loading...

More Telugu News