: వాల్మీకి మహర్షిపై కామెంట్లు.. శృంగార తార రాఖీ సావంత్‌కు అరెస్ట్ వారెంట్


బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, గత సంవత్సరం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి మీద ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఈ ప్రోగ్రాంలో వాల్మీకి మీద ఈ ఐటెం బాంబ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన వాల్మీకి కులస్తులు... రాఖీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, రాఖీ సావంత్ కు పదేపదే కోర్టు సమన్లు పంపినప్పటికీ... ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో, ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీన ఉంది. 

  • Loading...

More Telugu News