: పూంఛ్‌లోని దిగ్వార్ సెక్టార్ వద్ద భారత సైనికులపై కాల్పులకు తెగబడ్డ పాక్
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ రోజు ఉదయం సరిహద్దుల్లోని పూంఛ్‌లోని దిగ్వార్ సెక్టార్ వద్ద భారత సైనికులపై పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే ప్రతిస్పందించిన భారత సైన్యం పాకిస్థాన్ రేంజర్లకు దీటైన జవాబిస్తోంది. అయితే, ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని, భారత సైన్యం ఈ చర్యలను తిప్పికొడుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.