: 2019 ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ను ఓడించేందుకు బీజేపీ ఇప్పటినుంచే ప్రయత్నాలు


ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌మావేశాలు నిర్వ‌హించనుంది. హైద‌రాబాద్‌ లోక్ సభ నియోజకవర్గంలో గెలుపే ల‌క్ష్యంగా బీజేపీ పటిష్ఠానికి ఆ పార్టీ నేతలు వ్యూహాలు రూపొందించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8న బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా పాల్గొని కార్యకర్తలు, ఓటర్లనుద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా హైద‌రాబాద్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌జ్లిస్ పార్టీ తిరుగులేని విజ‌యం సాధిస్తోన్న విష‌యం తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు బీజేపీ నేత‌లు ఇప్ప‌టినుంచే స‌న్నాహాలు మొద‌లుపెట్టనున్న‌ట్లు స‌మాచారం. వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ను ఎలాగైనా ఓడించాలనే ధ్యేయంతోనే అమిత్ షా రంగంలోకి దిగనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News