: బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి అరెస్ట్
కేరళలోని కొట్టాయంలో సమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడిపై ఓ యువతి లైంగిక దాడికి పాల్పడింది. దీంతో, ఆమెపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. అంతేకాదు, బాధిత బాలుడు పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశాడన్న విషయం కూడా బయటకు రాలేదు.
పోక్సో చట్టం విషయానికి వస్తే... ఎవరైనా బాల, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే, వారిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. అయితే, ఇంతవరకు ఎక్కువగా పురుషులే ఈ చట్టం కింద అరెస్ట్ అయ్యారు. మహిళలపై ఈ కేసులు నమోదు కావడం చాలా అరుదు.