: గ్రనేడ్లతో విమానం ఎక్కబోయిన సైనికుడు... అరెస్ట్


సరిహద్దు రేఖ వద్ద విధులు నిర్వహించే సైనికుడు ఒకరు, రెండు గ్రనేడ్లతో విమానం ఎక్కబోయి ఈ ఉదయం అరెస్టయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, జమ్మూ కాశ్మీర్, యూరీ సెక్టారులో జవానుగా విధులు నిర్వహిస్తున్న 17 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ సైనికుడు గోపాల్ ముఖియా, శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. తన బ్యాగేజీని ఇచ్చి, విమానం ఎక్కేందుకు సిద్ధమైన వేళ, తనిఖీల్లో అతని బ్యాగులో గ్రనేడ్లు ఉన్నట్టు తేలడంతో, అరెస్ట్ చేసిన అధికారులు, పోలీసులకు అప్పగించారు. అతను గ్రనేడ్లను ఎందుకు బ్యాగులో ఉంచుకున్నాడన్న విషయమై ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News