: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం.. కోటిన్నర మంది రైతులకు రుణమాఫీ!


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది రైతుల రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో వారంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రేపు (సోమవారం) జరగబోయే తొలి కేబినెట్ మీట్‌లో రుణమాఫీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన కోటిన్నర మందితో కూడిన జాబితాను ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపినట్టు వ్యవసాయ మంత్రి సూర్య ప్రతాప్ సాహి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం రుణమాఫీ హామీ కూడా ఒకటని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే రుణమాఫీ జాబితాను సిద్ధం చేసే పనిలో పడినట్టు సాహి వివరించారు.

  • Loading...

More Telugu News