: పెడన ఎమ్మెల్యే పదవికి కాగిత వెంకట్రావ్ రాజీనామా!
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పదవులు దక్కించుకోలేకపోయిన టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబును కలిశాక, పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. ఆయనతో పాటు పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీడీపీ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కాగా, పెడన రహదారిపై వెంకట్రావ్ మద్దతుదారులు రాస్తారోకో చేపట్టారు. రేపు పెడన బంద్ కు కాగిత వెంకట్రావ్ పిలుపు నిచ్చారు.