: సీఎం చంద్రబాబును కలిసిన బోండా ఉమ!


ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోవడంపై ఎమ్మెల్యే బోండా ఉమ కినుక వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు ఉమ ఇంటికి వెళ్లి ఆయన్ని బుజ్జగించడం విదితమే. ఈ క్రమంలో చంద్రబాబును ఉమ కలిశారు. అనంతరం మీడియాతో ఉమ మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. మంత్రి వర్గంలో స్థానం దక్కనందుకు తాను చాలా బాధపడ్డానని, తనకు మంత్రి పదవి రాలేదని నిరాశ చెందిన 13 జిల్లాల కార్యకర్తలు బాధపడ్డారని అన్నారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తే వెళ్లి కలిశానని, కొన్ని సమీకరణల్లో భాగంగా స్థానం కల్పించ లేకపోయామని చెప్పారని అన్నారు. పాత, కొత్త కలయికలతో మంత్రి వర్గ విస్తరణ జరిగిందని, కొత్త వారికి చోటు కోసం తన లాంటి వారు కొందరు త్యాగం చేశారని, భవిష్యత్తులో తనకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నానని బోండా ఉమ అన్నారు. 

  • Loading...

More Telugu News