: 'ఫ్యాషన్ డిజైనర్' ప్రీ లుక్ పై ఘాటుగా స్పందించిన మంచు లక్ష్మి... ఆనాడు ఎందుకు మాట్లాడలేదని నెటిజన్ల ఎద్దేవా!


గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా రూపొంది, కామెడీ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన 'లేడీస్ టైలర్'కు సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా వస్తున్న 'ఫ్యాషన్ డిజైర్' ప్రీ లుక్ పై మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ కాగా, ఆపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ఈ ప్రీ లుక్ లో ఓ అమ్మాయి కొలతలను టేపుతో కొలుస్తున్నట్టు కనిపిస్తుండగా, "మనం అమ్మాయిలను ఇలా చూపించడం ఎప్పుడు మానేస్తాం?" అంటూ మంచు లక్ష్మి కామెంట్ చేసింది.

ఆ కామెంట్ కు మరో స్టార్ హీరోయిన్ రకుల్ సైతం మద్దతు పలకడంతో, చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ స్పందిస్తూ, తాము ఉద్దేశపూర్వకంగా ఈ పోస్టర్ ను చూపలేదని, సినిమాలోని సన్నివేశం నుంచే దీన్ని సెలక్ట్ చేసుకున్నామని అన్నాడు. ఇక మంచు లక్ష్మిపై వస్తున్న సెటైర్లు ఏంటంటే, మంచు కుటుంబం నిర్మించిన ఝుమ్మందినాదం, గుండెల్లో గోదారి వంటి సినిమాలను ప్రస్తావిస్తున్న నెటిజన్లు, ఆ సినిమాల్లో హీరోయిన్లను బోల్డ్ గా చూపించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. తాప్సీ ఎక్స్ పోజింగ్ పై మాట్లాడని మంచు లక్ష్మి, ఈ పోస్టర్ ను ఎలా తప్పు పడతారని అడుగుతున్నారు.

  • Loading...

More Telugu News