: చంద్రబాబుకు షాకిచ్చిన బొజ్జల... మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా!
అనారోగ్య కారణాలను చూపుతూ తనను మంత్రివర్గం నుంచి తొలగించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన చిత్తూరు జిల్లా నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖను రాశారు. మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవి కూడా తనకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే సేవలను అందిస్తానని, ఎమ్మెల్యేగా కూడా కొనసాగలేనని ఆయన తన లేఖలో రాసినట్టు తెలుస్తోంది. తన ఉద్వాసనపై అలకతోనే బొజ్జల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.