: ఇండియన్ ఓపెన్ టైటిల్ కు అడుగు దూరంలో సింధు


ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్-2017 టైటిల్ కు తెలుగు తేజం పీవీ సింధు అడుగు దూరంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ పై విజయం సాధించిన సింధు... అదే జోరును సెమీ ఫైనల్‌ లో చూపించింది. హోరాహోరీ జరిగిన ఈ ఫైనల్ లో ఇద్దరూ జోరుమీద ఆడినా సింధూదే పైచేయిగా నిలిచింది. రెండో సెట్ లో మాత్రం సింధు పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఓటమిపాలైంది. దీంతో మూడో సెట్ లో జూలు విదిల్చిన సింధు... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్ల మీద పాయింట్లు సాధిస్తూ విజయం సాధించింది. సెమీఫైనల్ లో సౌత్ కొరియాకు చెందిన సంగ్ జి హ్యూన్‌ పై సింధు 21-18, 14-21, 21-14 తేడాతో గెలిచింది. దీంతో టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ లో ప్రత్యర్థి కరోలినా మారిన్‌ తో తలపడనుంది.

  • Loading...

More Telugu News