: మంత్రి పదవి ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జలీల్ ఖాన్ అనుచరులు


ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ రేపు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు కళ్లలోవత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీకి అవకాశం ఉందని తెలియడంతో పలువురు మైనార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ పై విమర్శలు చేయడంలో ముందుండే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసం వద్ద ఆయన అనుచరులు సందడి చేస్తున్నారు. జలీల్ ఖాన్ కు మంత్రి పదవి ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. జలీల్ ఖాన్, చాంద్ బాషా, షరీఫ్ లలో ఒకరికి మంత్రి పదవి రానుంది. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ నివాసం వద్ద కొత్త మంత్రుల ఎంపిక ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 

  • Loading...

More Telugu News