: న్యూస్ చదివిన తరువాత టీవీలో విచిత్రంగా ప్రవర్తించిన యాంకర్!
ప్రముఖ న్యూస్ చానెల్ సీఎన్ఎన్ న్యూస్ 18 యాంకర్ కర్మా పల్జోర్ తన చివరి బులిటెన్ అందరికీ గుర్తుండిపోయేలా చేశాడు. న్యూస్ చివర్లో సీటులో నుంచి లేచి నిలబడి... తాను ప్యాంటు ధరించినట్టు చూపించాడు. న్యూస్ స్టూడియోలో కూర్చొని న్యూస్ చదివేటప్పుడు యాంకర్ల ముఖం, భుజం, చాతీ వంటి పై భాగాలే కనిపించేలా క్లోజప్ షాట్ లోనే వారిని చూపిస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో న్యూస్ యాంకర్ల వస్త్రధారణపై సెటైర్లు వస్తుంటాయి. ఇటీవల బ్రిటన్ లో ప్రచారంలోకి వచ్చిన ఓ వీడియో అయితే, ప్రేక్షకులలో గందరగోళాన్ని సృష్టించింది. న్యూస్ చదివేవారు ప్యాంటు వేసుకోరన్నట్లు ఉన్న ఈ వీడియో బ్రిటన్‌లో బాగా వైరల్ అయింది.
ఈ నేపథ్యంలోనే తాను ఇలా స్పందిస్తున్నానని, న్యూస్ యాంకర్లు ఫ్యాంట్లు వేసుకోరన్న భావన కొందరిలో బలంగా ఏర్పడిందని కర్మా పల్జోర్ అన్నాడు. ఆ భావనను తొలగించాలని, న్యూస్ చివర్లో తాను ప్యాంటు వేసుకున్నట్టు చూపించి, ‘‘అవును.. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నట్టుగానే... మాలో చాలామంది ప్యాంట్లు వేసుకుంటారు’’ అని చెప్పాడు. ‘‘సో.. కర్మా పల్జోర్ ప్యాంటు వేసుకుని సైన్ ఆఫ్ చేస్తున్నాడు’’ అంటూ బులిటిన్ ముగించాడు. ఆ సంస్థలో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన తన చివరి బులిటిన్ లో ఇలా ప్రవర్తించాడు. ఈ వీడియోను చూసిన ప్రేక్షకులు పగలబడి నవ్వుకున్నారు.
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">'Anchors do wear pants' <a href="https://twitter.com/Karma_Paljor">@Karma_Paljor</a> clears the air on his last show at CNN-News18. We will miss you. <a href="https://t.co/A56Ro6lvsn">pic.twitter.com/A56Ro6lvsn</a></p>— News18 (@CNNnews18) <a href="https://twitter.com/CNNnews18/status/847810847166545921">March 31, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>